జిల్లాలో ఉన్న ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు శనివారం పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు శనివారం పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, గుంతకల్లులో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
నెలకు రూ.10 వేలకు పైగా వేతనం ఉంటుందని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హత కలిగి 19 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న వారు బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ప్రతులతో శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.