ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు.
	అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీల్లో అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అండర్–19 బాలికల జట్లు తలపడతాయన్నారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలోని బీ క్రీడా మైదానం, విన్సెంట్ క్రీడా మైదానాల్లో నిర్వహిస్తామని తెలిపారు.  అనంత క్రీడా గ్రామానికి ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన బాలికల జట్లు చేరుకున్నాయన్నారు.
	
	మ్యాచ్‌ల వివరాలు
	తేది        తలపడే జట్లు
	15–07–2017    కడప–కర్నూలు
	15–07–2017    అనంతపురం–నెల్లూరు
	16–07–2017    చిత్తూరు–నెల్లూరు
	16–07–2017    అనంతపురం–కర్నూలు
	18–07–2017    అనంతపురం–కడప
	18–07–2017    చిత్తూరు–కర్నూలు
	19–07–2017    నెల్లూరు–కర్నూలు
	19–07–2017    కడప–చిత్తూరు
	20–07–2017    చిత్తూరు–అనంతపురం
	20–07–2017    కడప–నెల్లూరు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
