నేడు ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం | today onwards llr in online | Sakshi
Sakshi News home page

నేడు ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం

Sep 22 2017 10:24 PM | Updated on Sep 22 2017 11:13 PM

రవాణాశాఖలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే విధానాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉపరవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌: రవాణాశాఖలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే విధానాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉపరవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ తెలిపారు. ఎస్కేయూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహించి విద్యార్థులకు తొలిసారిగా ఆన్‌లైన్‌ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సదరు కళాశాలతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలుత ఆన్‌లైన్‌లో 24 గంటల్లోనే ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేస్తామని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement