రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం కర్నూలుకు రానున్నారు.
నేడు మంత్రి కాలువ శ్రీనివాసులు రాక
Jun 5 2017 11:28 PM | Updated on Aug 30 2019 8:37 PM
	కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం కర్నూలుకు రానున్నారు. ఆరోజు వివిధ నియోజకవర్గాల్లో జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతపురం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10.30 గంటలకు నంద్యాల చేరుకొని అక్కడ నిర్వహించే నవనిర్మాణ దీక్ష సభలో, ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం కర్నూలు చేరుకొని ఇక్కడ జరిగే నవనిర్మాణ దీక్షలో  పాల్గొంటారు.
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
