రాయచోటి మున్సిపల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు తెలిపారు.
రాయచోటిటౌన్: రాయచోటి మున్సిపల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రాయచోటి మున్సిపాలిటీని ప్రభుత్వం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించిందని, ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణ పరిధిలోని అనేక అభివద్ధి పథకాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కౌన్సిలర్లు తప్పకుండా హాజరు కావాలని కోరారు.