రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. బాలానగర్, కుత్బుల్లాపూర్, మల్కజిగిరి, శేర్‌లింగంపల్లి మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మండల విద్యాధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.