నేడు ఇన్‌స్పైర్‌–2017పై అవగాహన | today awareness on inspire 2017 | Sakshi
Sakshi News home page

నేడు ఇన్‌స్పైర్‌–2017పై అవగాహన

Feb 9 2017 9:59 PM | Updated on Sep 5 2017 3:18 AM

ఇన్‌స్పైర్‌–2017పై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇన్‌స్పైర్‌–2017పై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27లోగా ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు గుత్తి డివిజన్, మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం డివిజన్‌ పరిధిలోని ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. అన్ని యాజమాన్యాల  పరిధిలోని పాఠశాలల నుంచి కంప్యూటర్‌ పరిజ్ఞానం కల్గిన ఒక్కో సైన్స్‌ ఉపాధ్యాయుడిని పంపాలని డీఈఓ ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement