FSSAI లోగో ఉందా? ఎక్స్‌పైరీ తేదీ ఏదీ? చిన్నారి ప్రశ్నలతో షాక్‌! | Kids Special Story On Young Girl Spots Food Adulteration Dussehra | Sakshi
Sakshi News home page

FSSAI లోగో ఉందా? ఎక్స్‌పైరీ తేదీ ఏదీ? చిన్నారి ప్రశ్నలతో షాక్‌!

Oct 24 2026 11:55 AM | Updated on Oct 24 2026 12:41 PM

Kids Special Story On Young Girl Spots Food Adulteration Dussehra

కథ

కిడ్స్‌ స్పెషల్‌

సాయిశ్రీ 5వ తరగతి చదువుతుంది. పదేళ్ల పిల్ల అయినా, తెలివిలో చురుకు. దసరా పండుగ. అమ్మతో కలిసి పిండి వంటల కోసం సరుకులు కొనడానికి బజారుకు వెళ్ళింది. బొబ్బట్లకు పప్పు, పంచదార, నెయ్యి, మైదా కావాలి. అమ్మ ఒక చౌక పంచదార ప్యాకెట్‌ తీసుకుంది. సాయి శ్రీ దాన్ని చేతిలోకి తీసుకుని, ‘అమ్మా, దీని మీద FSSAI లోగో ఉందా? ఎక్స్‌పైరీ తేదీ ఉందా చూడు. లోగో లేదు’ అంది.

తర్వాత నెయ్యి దగ్గరకు వెళ్ళింది. 
‘అమ్మా, ఈ నెయ్యి రంగు చాలా తెల్లగా ఉంది. నిజమైన నెయ్యి ఇంత తెల్లగా ఉండదు. ఇది కల్తీ అయి ఉండొచ్చు‘ అంది.
కొట్టతను నవ్వి ‘చిన్న పిల్లవు, నీకెందుకు ఈ పరీక్షలు? అమ్మ కొంటుందిలే’ అన్నాడు.

సాయిశ్రీ ధైర్యంగా అంది, ‘అంకుల్‌... దసరా అంటే చెడు మీద మంచి గెలుపు. కల్తీ తిండి మన పిల్లలకు చెడు కదా? పండగకు తినే తిండి శుభ్రంగా ఉండాలి’ ఆమె మాటలు విని అమ్మ మంచి బ్రాండ్‌ ప్యాకెట్లు, అగ్‌ మార్క్‌ ఉన్న పప్పు, ప్యాకింగ్‌ తేదీ ఉన్న నెయ్యి కొన్నది. ఇంటికి వచ్చి అమ్మ అంది... ‘నీ వల్ల మన పండగ వంటలు శుభ్రంగా మారాయి. నువ్వు నిజమైన దుర్గవే’.

సాయిశ్రీ నవ్వి ‘అమ్మా, దుర్గా దేవి చెడు మీద త్రిశూలం ఎత్తింది. నేను తెలివితో కల్తీని పట్టుకుని ఆ తల్లి దారిలో నడిచాను’ అంది. దసరా రోజు ఆ ఇంట్లో పిండివంటల వాసనతో ΄ాటు, తెలివి  కూడా గుబాళించింది.

ఇదీ చదవండి: పిల్లల్లో నైతిక విలువలు పెంచాలంటే.. పేరెంట్స్‌ ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement