బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ | To the Brahmotsavas .. | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ

May 8 2017 11:01 PM | Updated on Sep 5 2017 10:42 AM

బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ

బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ

పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం ద్వారా అంకుర్పారణ జరిగింది. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారాకనాథాచార్యులు అధ్వర్యంలో వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉరవకొండ రూరల్‌ :  పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం ద్వారా అంకుర్పారణ జరిగింది. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారాకనాథాచార్యులు అధ్వర్యంలో వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహా మంగళహారతి, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడిని ప్రత్యేక పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.శాంతిహోమం, ప్రాకారోత్సవ కార్యక్రమాలు వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈఓ రమేష్‌బాబు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌ కన్‌స్ర్టక్షన్స్‌ అధినేత ఆమిలినేని సురేంద్ర సహకారంతో ఆలయం చుట్టూ మట్టితో చదును చేయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement