తుంగతుర్తి అభివృద్ధికి కృషి | To effort to the tungaturthi development | Sakshi
Sakshi News home page

తుంగతుర్తి అభివృద్ధికి కృషి

Oct 7 2016 10:28 PM | Updated on Jul 29 2019 2:51 PM

తుంగతుర్తి అభివృద్ధికి కృషి - Sakshi

తుంగతుర్తి అభివృద్ధికి కృషి

తుంగతుర్తి తుంగతుర్తి పేరుకే నియోజకవర్గం కాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించిన మాదిగ చైతన్య మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తుంగతుర్తి
 తుంగతుర్తి పేరుకే నియోజకవర్గం కాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించిన మాదిగ చైతన్య మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుంగతుర్తి నేషనల్‌ హైవేకి, వరంగల్‌ మహా పట్టణాలకు దగ్గర ఉన్నప్పటికి అభివృద్ది చెందకపోవడం విచారకరమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  తుంగతుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీబావం
 మూడు రోజులుగా పసునూర్‌ మాజీ ఎంపీటీసీ తొడ్సు లింగయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరాల వీరయ్యలు  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని ప్రొఫెసర్‌ కోదండరాం పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూర్‌ గ్రామాన్ని తుంగతుర్తిలో ఉంచే విధంగా సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు. పాలన సౌలభ్యం కోసం మండలాలను ఏర్పాటు చేయడం మంచిదే కాని ప్రజల అభీష్టం మేరకే చేయాలన్నారు.  మాదిగ చైతన్య మహోత్సవ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తయారు చేసుకొని భారీ ర్యాలీగా వీధుల గుండా ర్యాలీగా అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు వచ్చి ఆటపాటలతో అందరిని ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల ప్రొఫెసర్‌ ఇటికాల పురుషోత్తం, ప్రభాకర్‌ రెడ్డి, ఏపూరి సోమన్న, ఎంపీడీఓ వెంకటాచారి, సాయిబాబా, పాల్వాయి నగేష్, హరిక్రిష్ణ, లక్ష్మణ్, యాదగిరి, శ్యాంసుందర్, సుందర్‌ రావు, పురుషోత్తం, మల్లెపాక సుధాకర్, అంజయ్య, నాగయ్య, ఎడవెళ్లి ఈశ్వర్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement