అండగా ఉంటాడనుకుంటే..అందరినీ వదిలి వెళ్లాడు! | To be okay .. all left! | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాడనుకుంటే..అందరినీ వదిలి వెళ్లాడు!

May 8 2017 11:43 PM | Updated on Sep 5 2017 10:42 AM

అండగా ఉంటాడనుకుంటే..అందరినీ వదిలి వెళ్లాడు!

అండగా ఉంటాడనుకుంటే..అందరినీ వదిలి వెళ్లాడు!

తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం అప్పులు మిగిల్చింది. ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. కుటుంబపోషణ భారమైంది. పిల్లల చదువులు భారమయ్యాయి. కూతురు పెళ్లికి చేసిన అప్పు కొండలా పెరిగిపోతోంది. ఇక చేసేది లేక పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపారు. అతడు పంపే డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ చిన్న కుమారిడిని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం కుమారుడిని పొట్టన పెట్టుకుంది.

  • కన్నీరుమున్నీరవుతున్న మౌలాలి తల్లిదండ్రులు
  • నేడు గ్రామానికి చేరనున్న మృతదేహం
  •  

     తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం అప్పులు మిగిల్చింది.  ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. కుటుంబపోషణ భారమైంది. పిల్లల చదువులు భారమయ్యాయి.  కూతురు పెళ్లికి చేసిన అప్పు కొండలా పెరిగిపోతోంది. ఇక చేసేది లేక పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపారు. అతడు పంపే డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ చిన్న కుమారిడిని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం కుమారుడిని పొట్టన పెట్టుకుంది. దేశం కాని దేశంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు విలవిలలాడారు. కుమారుడి కడచూపు కోసం వారు నిద్రహారాలు మాని ఎదురుచూస్తున్నారు. 

     

    ఎన్‌పీకుంట : కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానంటూ వెళ్లిన కుమారుడు శవమై వస్తుండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన హసనాపురం బాషా కుమారుడు హెచ్‌.మౌలాలి(24) కుటుంబపోషణ కోసం కువైట్‌కు వెళ్లి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలకేంద్రంలోని పశువుల మంద వీధిలో నివాసముంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న బాషాకు అప్పులు ఎక్కువయ్యాయి. అప్పు చేసి కూతురి వివాహం చేశారు. పిల్లల చదువులు భారమయ్యాయి. దీంతో పెద్ద కుమారుడు మౌలాలిని కువైట్‌కు పంపారు.

    అతడు సంపాందించి పంపిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ  చిన్న కుమారుడు తాజ్‌ను చదివిస్తున్నారు. అన్నీ సర్దుకుంటాయిలే అనుకునే సమయంలోనే పిడుగులాంటి వార్త రావడంతో బాషా కుటుంబం కుదేలైంది. రోడ్డు ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  ప్రమాదంలో గాయపడిన వారి అల్లుడు చాంద్‌బాషాకు ఆదాన్‌ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. కాగా మౌలాలి మృతదేహం సోమవారం అర్ధరాత్రికి కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రానికి ఇంటికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధవులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement