జిల్లా వ్యాప్తంగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) ప్రదర్శనను జిల్లావిద్యాశాఖ శుక్రవారం చేపట్టింది. అన్ని మండల కేంద్రాల్లో టీఎల్‌ఎం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీ, మండలపరిషత్, ప్రభుత్వ, మునిసిపల్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్‌ఎంలను తయారు చేసి ఈ ప్రదర్శనల్లో ఉంచారు.
గురువుల సామర్థ్యాల ప్రదర్శన
Oct 14 2016 11:17 PM | Updated on Sep 4 2017 5:12 PM
ఏలూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) ప్రదర్శనను జిల్లావిద్యాశాఖ శుక్రవారం చేపట్టింది. అన్ని మండల కేంద్రాల్లో టీఎల్‌ఎం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీ, మండలపరిషత్, ప్రభుత్వ, మునిసిపల్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్‌ఎంలను తయారు చేసి ఈ ప్రదర్శనల్లో ఉంచారు. ఏలూరు మండలానికి సంబంధించి అర్భన్ స్కూల్స్‌కు స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, రూరల్ స్కూల్స్ సత్రంపాడు, శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఉప విద్యాధికారి డి.ఉదయ్‌కుమార్ టీఎల్‌ఎం ప్రదర్శనలను పర్యవేక్షించగా, జిల్లా విద్యాధికారి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీఎల్‌ఎం ప్రదర్శనలు పరిశీలించారు. విద్యార్థికి అర్థమయ్యేలా వినూత్నమైన అంశాలతో ప్రాజెక్టులు తయారు చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ టీఎల్‌ఎం ప్రదర్శనల్లో వినూత్నమైన ప్రాజెక్టుల జాడ కన్పించలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయులపై పనిభారాన్ని విపరీతంగా పెంచేయటంతో టీచర్లపై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement