8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత | Tirumala temple to be closed during solar eclipse | Sakshi
Sakshi News home page

8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత

Mar 4 2016 12:09 PM | Updated on Aug 28 2018 5:55 PM

8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత - Sakshi

8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత

మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు.

తిరుమల : మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో డి. సాంబశివరావు మాట్లాడుతూ... మార్చి 9వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో 8వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయం మూసివేస్తామని తెలిపారు. 

తిరుమలలోని కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్న వారికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వివాహానికి అవసరమైనవన్నీ టీటీడీ సమకూరుస్తుందన్నారు. అలాగే వెయ్యి కాళ్ల మండపం పునర్ నిర్మాణానికి టెండర్లు మార్చి 11వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నెలకు గాను 50 వేల ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement