రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలు | Three persons injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలు

Aug 7 2016 10:57 PM | Updated on Aug 30 2018 4:07 PM

యాదగిరిగుట్ట: హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

యాదగిరిగుట్ట: హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి నుంచి ఆలేరు వైపునకు వెళ్తున్న మహేంద్రజీపు వంగపల్లి వద్ద నిలిచి ఉన్న ఆటోను, ద్విచక్రవాహనంతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్‌ గడ్డం బాలయ్య, బైక్‌పై ఉన్న బండి మధు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రశాంత్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం జీపు అతివేగమని స్థానికులు తెలుపుతున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement