దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు.
దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటేవరకూ ప్రజావేదిక జరిగింది. 25 గ్రామాల్లో తొలుత సామాజిక తనిఖీలు చేశారు. తేదీ 1.4.2015 నుంచి 31.5.2016 వరకు రూ.3.93కోట్ల విలువైన 1818 పనులకు సంబంధించిన నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర చర్చలు జరిగిన అనంతరం వివిధ పనుల్లో తేడాలు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన పనులకు సంబంధించి రూ.4.43లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి బాల్నెపల్లి, ఇర్కిగూడెం, చాంప్లాతండాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఓలు నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.