వేల్పనూరు నుంచి మూడోరోజు రైతు భరోసా యాత్ర | Third day of ys jagan mohan reddy raithu bharosa yatraToday | Sakshi
Sakshi News home page

వేల్పనూరు నుంచి మూడోరోజు భరోసా యాత్ర

Jan 7 2017 10:17 AM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది.

కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది. వైఎస్‌ జగన్‌  ఈరోజు ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. గ్రామం నుంచి రోడ్‌ షో గా అబ్దుల్లాపురం, వెలుగోడు మీదగా బోయరేవులు చేరుకుంటారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అనంతరం మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా రోడ్‌ షో లింగాపురం చేరుకుంటుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement