రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక | They selected for State level Taekwando competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

Sep 21 2016 8:18 PM | Updated on Sep 4 2017 2:24 PM

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయురాలు కె.వనజాక్షి తెలిపారు.

నిజాంపట్నం: జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయురాలు కె.వనజాక్షి తెలిపారు. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రేపల్లె ప్రభుత్వ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలలో ప్రజ్ఞం జెడ్పీహైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం ప్రజ్ఞం జెడ్పీహైస్కూల్లో విద్యార్థులకు అభినందనసభ నిర్వహించారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన ఎస్కే గఫార్, కర్రా దిలీప్, టి అఖిల్, బి.తేజ, పి.మౌనికాబాబి ఈ నెల 25,26,27 తేదీలలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్బంగా పీఈటీ కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు(బుజ్జి)ని, విద్యార్థులను  ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement