జీతాలు లేక ఆయుష్‌ ఉద్యోగుల ఇబ్బందులు | there is no salaries for 6 months | Sakshi
Sakshi News home page

జీతాలు లేక ఆయుష్‌ ఉద్యోగుల ఇబ్బందులు

Dec 17 2016 6:55 PM | Updated on Sep 4 2017 10:58 PM

జీతాలు లేక ఆయుష్‌ ఉద్యోగుల  ఇబ్బందులు

జీతాలు లేక ఆయుష్‌ ఉద్యోగుల ఇబ్బందులు

గత 6నెలలుగా జీతాలు అందక జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయుష్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): గత 6నెలలుగా జీతాలు అందక జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయుష్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుష్‌లో హోమియోపతి,నేచరోపతి,యూనాని, ఆయుర్వేదం తదితర విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే అయుష్‌ ఉద్యోగులు వేతనాలు అందక విలవిలాడుతున్నారు. జిల్లాలో సుమారు 70 మంది సిబ్బంది, ఐదుగురు వైద్యులు పనిచేస్తున్నారు. వీరిలో వైద్యునికి ప్రతి నెల సుమారు 18 వేలు, కాంపౌడర్‌కి 9200,స్‌ఎన్‌ఓలకు 6700 రూపాయలు చెల్లించాల్సి ఉంది.

అయితే గత 6 నెలలుగా జీతాలు రాకపోవడం, పైగా పెద్ద నోట్లు రద్దుకావడంతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీతాలు అందకపోయిన వారు అష్టకష్టాలు పడి వీధులకు హజరు కావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.వేతనాలు అందక,అప్పు పుట్టక నరకం చూస్తున్నాము అని వారు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి అయుష్‌ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
 
 
రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలల జీతాలు అందాల్సి ఉంది: కృష్ణ, ఆయుష్‌ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్‌ విభాగంలో పనిచేసి ఉద్యోగులకు 8 నెలలకు జీతాలు చెల్లించాల్సి ఉంది.పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి 6 నెలలకు వేతనాలు రావాల్సి ఉంది.వేతనాలు అందక ఆయుష్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నప్పటికి ప్రభుత్వం,వైద్యా శాఖ అధికారులు పట్టించుకొవడం లేదు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆయుష్‌ ఉద్యోగులకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement