ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం గొళ్లముడిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
నందిగామ(కృష్ణాజిల్లా): ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం గొళ్లముడిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి రెండు హుండీలతో పాటు స్వామివారి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.