తిరుమలకు వెళ్తే ఇల్లు దోచేశారు | Theft in Muttukur | Sakshi
Sakshi News home page

తిరుమలకు వెళ్తే ఇల్లు దోచేశారు

Sep 3 2016 2:23 AM | Updated on Sep 4 2017 12:01 PM

తిరుమలకు వెళ్తే ఇల్లు దోచేశారు

తిరుమలకు వెళ్తే ఇల్లు దోచేశారు

ముత్తుకూరు : దైవదర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేలోగా దొంగలు ఇల్లు దోచేశారు. ముత్తుకూరు బజారువీధిలో ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది.

 
ముత్తుకూరు : దైవదర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేలోగా దొంగలు ఇల్లు దోచేశారు. ముత్తుకూరు బజారువీధిలో ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాజేశ్వరి ఫర్టిలైజర్స్‌ యజమాని అన్నాల విజయమారుతీరావు మిద్దెపై ఇంటికి తాళాలు వేసి, భార్య, కొడుకు, కోడలు కలిసి బుధవారం తిరుమలకు వెళ్లారు. తిరిగి గురువారం రాత్రి వచ్చే సరికి ఇల్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి కుడివైపు సందులోని తలుపుల తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పడక గదిలోని బీరువా తాళాలు పగులగొట్టి, లాకర్‌లో ఉన్న రూ, 50వేల నగదు, ఒక కిలో వెండి వస్తువులు, 4 గ్రాముల బంగారు కమ్మలు అపహరించుకుపోయారు. వీటి విలువ రూ.1.25 లక్షలుంటుందని బాధితులు తెలిపారు. వేలిముద్రలు పడకుండా దొంగలు నీళ్లతో కడిగేశారు. ఆధారాలు లభించకుండా పప్పుల పొడి చల్లేశారు. శుక్రవారం ఎస్సై శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ క్షుణంగా పరిశీలించి ఆధారాలు సేకరించింది. బాధితుడు విజయమారుతీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement