కమలాపురంలో చోరీ | Theft In Kamalapuram | Sakshi
Sakshi News home page

కమలాపురంలో చోరీ

Oct 7 2016 10:59 PM | Updated on Aug 21 2018 8:06 PM

స్థానిక రైల్వేగేటు సమీపంలోని పోలీస్‌లైన్‌కు చెందిన శ్రీనివాసులు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నెల్లూరులో బంధువుల వివాహానికి గురువారం ఉదయం వెళ్లారు. బయట తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దుండగులు గురువారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన నగదుతోపాటు బంగారు, వెండి నగలు దొంగలించారు.

కమలాపురం: స్థానిక రైల్వేగేటు సమీపంలోని పోలీస్‌లైన్‌కు చెందిన శ్రీనివాసులు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నెల్లూరులో బంధువుల వివాహానికి గురువారం ఉదయం వెళ్లారు. బయట తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దుండగులు గురువారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన నగదుతోపాటు బంగారు, వెండి నగలు దొంగలించారు. ఇంటి తాళం పగులగొట్టిన విషయాన్ని అదే వీధిలో నివాసం ఉన్న వారి బంధువులు చూసి శుక్రవారం ఉదయం శ్రీనివాసులుకు ఫోన్‌ చేశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఇంట్లోని బీరువాలో రూ.లక్ష నగదు, హ్యాండ్‌ బ్యాగ్‌లో రూ.5 వేలు, 5 తులాల వెండి గజ్జలు, రెండున్నర తులాల విరిగిన బంగారు చైన్‌ ఉన్నట్లు శ్రీనివాసులు పోలీసులకు ఫోన్‌లో తెలిపారు. ఈ మొత్తాన్ని దొంగలు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. బాధితులు వచ్చాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement