పట్టణంలోని భాగ్యనగర్ ఎస్‌జేపీ హైస్కూల్ వద్ద నివాసముంటున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ షేక్ అబ్దుల్‌కరీమ్ ఇంట్లో చోరీ జరిగింది.
గుంతకల్లు టౌన్ : పట్టణంలోని భాగ్యనగర్ ఎస్‌జేపీ హైస్కూల్ వద్ద నివాసముంటున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ షేక్ అబ్దుల్‌కరీమ్ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపు గడియను తొలగించి బెడ్‌రూమ్‌లోని బీరువాలో దాచిన 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలు గుచూసింది.
అబ్దుల్ కరీమ్ కుటుంబసభ్యులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి.. వెనుకవైపున ఉన్న మరో ఇంట్లో నిద్రించారు. ఆదివారం ఉదయం తలుపులు తెరిచి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ–2 శ్రీరాములు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బాధితుడి నుంచి ఇంకా రాతపూర్వక ఫిర్యాదు అందలేని తెలిపారు.