కాంట్రాక్టర్‌ ఇంట్లో చోరీ | theft in contractor house | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్‌ ఇంట్లో చోరీ

Apr 30 2017 11:43 PM | Updated on Sep 5 2017 10:04 AM

కాంట్రాక్టర్‌ ఇంట్లో చోరీ

కాంట్రాక్టర్‌ ఇంట్లో చోరీ

గుంతకల్లు మస్తాన్‌పేటకు చెందిన రైల్వే క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌.సుధాకర్‌ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

గుంతకల్లు టౌన్‌ : గుంతకల్లు మస్తాన్‌పేటకు చెందిన రైల్వే క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌.సుధాకర్‌ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.25 వేల నగదును చోరీ చేసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఉక్కపోత భరించలేక కుటుంబ సభ్యులందరూ కలసి ఇంటికి తాళం వేసి, మిద్దెపై నిద్రించారు. తెల్లవారుజామున వచ్చి చూడగా.. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసమై ఉన్నాయి. నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement