తమ్ముడిని కొట్టి చంపిన అన్న | The younger brother was beaten, killed by older brother | Sakshi
Sakshi News home page

తమ్ముడిని కొట్టి చంపిన అన్న

Aug 5 2016 5:50 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఆస్తి కోసం ఓ అన్న సొంత తమ్మున్నే దారుణంగా కొట్టి చంపాడు.

 ఆస్తి కోసం ఓ అన్న సొంత తమ్మున్నే దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అన్నదమ్ముల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అన్న కర్రతో తమ్ముడి పై దాడి చేయడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement