ప్రొద్దుటూరులో రెండు దుకాణాల్లో చోరీ | the theft of two stores in proddatur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో రెండు దుకాణాల్లో చోరీ

Jul 28 2016 6:16 PM | Updated on Aug 11 2018 6:07 PM

ప్రొద్దుటూరులో రెండు దుకాణాల్లో చోరీ - Sakshi

ప్రొద్దుటూరులో రెండు దుకాణాల్లో చోరీ

స్థానిక పప్పుల బజార్‌లోని రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు వర్రా ప్రభాకర్, చాడబోయిన కొండయ్యలు గత కొన్నేళ్ల నుంచి పప్పుల వ్యాపారం చేస్తున్నారు.

ప్రొద్దుటూరు క్రైం:
స్థానిక పప్పుల బజార్‌లోని రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు వర్రా ప్రభాకర్, చాడబోయిన కొండయ్యలు గత కొన్నేళ్ల నుంచి పప్పుల వ్యాపారం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు వారి దుకాణాలకు వేసిన తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ప్రభాకర్‌ దుకాణంలో రూ.28 వేలు, కొండయ్య దుకాణంలో రూ.25 వేలు దోచుకొని వెళ్లారు. తర్వాత కొద్ది సేపటికే ఆ వీధిలో తిరుగున్న కాపలాదారుడు దుకాణ తలుపులు తెరచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించాడు.  దీంతో అతను వెంటనే దుకాణ దారులకు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే నిందితుల కోసం పట్టణ మంతా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దుకాణ యజమానులు ప్రభాకర్, కొండయ్యలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement