ప్రారంభమైన హ్యాండ్‌బాల్‌ పోటీలు | The start of the handball competitions | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన హ్యాండ్‌బాల్‌ పోటీలు

Aug 7 2016 12:02 AM | Updated on Sep 4 2017 8:09 AM

తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్స్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రా రంభమయ్యాయి

వరంగల్‌ స్పోర్ట్స్‌ : తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్స్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రా రంభమయ్యాయి.
 
హన్మకొండలోని జవహర్‌లాల్‌ ఇండోర్‌ స్టేడియంలో అసోసియేషన్‌ రాష్ట్ర కా ర్యదర్శి శ్యామల పవన్‌కుమార్‌ అధ్యక్షతన  జరి గింది. ఈ సభకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సభకు హాజరైన అతిథులను శాలువా, మెమోంటో తో సత్కరించారు.  కార్యక్రమంలో సీని యర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,వావిలాల సారంగపాణి, రాజలింగం, తోట శ్యాంప్రసాద్, చాగంటి శ్రీనివాస్, మేడిశెట్టి సుధాకర్, గమ్మళ్ళ సురేందర్, సురేష్, ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్, విష్ణు  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement