చిత్తూరు జిల్లా సదుం మండలం నాయనలంక గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు.
చిత్తూరు జిల్లా సదుం మండలం నాయనలంక గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. పులిచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన తారిఖ్(35) గురువారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా నాయనలంక సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తారిఖ్ పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.