ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి

Apr 15 2016 7:46 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం అక్కమ్మకొండ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంత నుంచి రాయదుర్గం వెళ్తుండగా.. అక్కమ్మకొండ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న గోపి(40) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement