అత్తిలిలో భారీ చోరీ | the massive theft in attili | Sakshi
Sakshi News home page

అత్తిలిలో భారీ చోరీ

Jun 1 2016 1:18 PM | Updated on Sep 4 2017 1:25 AM

అత్తిలి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది.

అత్తిలి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అత్తిలి గ్రామానికి చెందిన బొర్రా సుబ్బారావు అనే ధాన్యం వ్యాపారి ఇంట్లో బుధవారం వేకువజామున దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి రూ.4 లక్షల నగదు, 23 కాసుల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లందరూ మేడ మీద నిద్రిస్తున్నారు. ఉదయం చోరీ జరిగిన విషయం గమనించిన సుబ్బారావు పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. తణుకు సీఐ రాంబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement