ఉద్రిక్తతకు దారి తీసిన కౌలు వ్యవహారం | the lease transaction Leading to tension | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతకు దారి తీసిన కౌలు వ్యవహారం

Jun 27 2016 3:32 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా మంగళగిరిలోని దేవాలయ భూముల వేలం పాట సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని దేవాలయ భూముల వేలం పాట సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. భూముల్లో సాగు చేసుకుంటున్న తమకే మళ్లీ కౌలుకు ఇవ్వాలని కొందరు రైతులు ఆందోళన చేశారు. అధికారులు మాత్రం కొత్తవారికి కౌలుకు ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. దీంతో ఆగ్రహించిన ఒక తండ్రి, కొడుకు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు వేలంపాటను ఆపేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement