సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోని ప్రభుత్వం
హుజూర్‌నగర్ : సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు.
హుజూర్‌నగర్ : సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సమర భేరీ సైకిల్ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రకు స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ –2 నిర్వహణలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆకారపు నరేష్, కొమరాజు నరేష్, సైదా, ఆత్కూరి వెంకటేష్, సాయి, గణేష్, భాను, రాజు, మహేష్, పవన్, వెంకటేష్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు.