ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణకు తొలి అడుగుకావాలి | The first step is to categorize the needs dharmayuddha Congress | Sakshi
Sakshi News home page

ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణకు తొలి అడుగుకావాలి

Nov 24 2016 10:23 PM | Updated on Sep 4 2017 9:01 PM

ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణకు తొలి అడుగుకావాలి

ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణకు తొలి అడుగుకావాలి

ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ధర్మయుద్ధ మహాసభ ఎస్సీవర్గీకరణ సాధనకు తొలి అడుగు కావాలని జిల్లా దళిత సంఘాల అధ్యక్షులు, నాయకులు అన్నారు. సీక్యాంప్‌లోని డ్రైవర్స్‌అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం అన్ని దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.

కర్నూలు సీక్యాంప్‌: ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ధర్మయుద్ధ మహాసభ ఎస్సీవర్గీకరణ సాధనకు తొలి అడుగు కావాలని జిల్లా దళిత సంఘాల అధ్యక్షులు, నాయకులు అన్నారు. సీక్యాంప్‌లోని డ్రైవర్స్‌అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం అన్ని దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రాయలసీమ మాదిగ దండోర అధ్యక్షుడు అనంతరత్నం మాదిగ, ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్, నేషనల్‌ టూరిజం బోర్డ్‌ సభ్యుడు మూలింటి సుదర్శనం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  వర్గీకరణ కోసం అన్ని దళిత సంఘాలు ఒక్కతాటిపైకి రావడం శుభపరిణామమన్నారు. ధర్మయుద్ధ మహాసభ ద్వారా కేంద్రానికి హెచ్చరిక చేయాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement