వైభవంగా గురుపౌర్ణమి | The exposition gurupaurnami | Sakshi
Sakshi News home page

వైభవంగా గురుపౌర్ణమి

Jul 19 2016 10:26 PM | Updated on Sep 4 2017 5:19 AM

వైభవంగా గురుపౌర్ణమి

వైభవంగా గురుపౌర్ణమి

జిల్లా వ్యాప్తంగా మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞాన జ్యోతివై ఉత్తమ జీవితానికి ఉత్తమోత్తమ మార్గాన్ని చూపు సాయిదేవా అంటూ భక్తులు వేడుకున్నారు


– భక్తులతో ఆలయాలు కళకళ

కడప కల్చరల్‌ :
జిల్లా వ్యాప్తంగా మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞాన జ్యోతివై ఉత్తమ జీవితానికి ఉత్తమోత్తమ మార్గాన్ని చూపు సాయిదేవా అంటూ భక్తులు వేడుకున్నారు. శ్రీ షిరిడిసాయి ఆలయాలలో ఉదయం 4 గంటల నుంచే కాగడ హారతి అనంతరం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సాయిబాబా ఆలయాలు, దత్తాత్రేయస్వామి ఆలయాలలో మూల విరాట్‌లను ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మధ్యాహ్నం అన్నదానం  నిర్వహించారు. పలు దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో సమీప రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఊహించనంత ఎక్కువ మంది భక్తులు తరలి రావడంతో నిర్వాహకులు మరింత జాగ్రత్త వహించి అప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లను చేశారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement