ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనసముంద్రం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన భూలక్ష్మీ(37) గ్రామ శివారులోని అల్లోని కుంట చెరువులో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.