లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో దంపతులకు చోటు | The couple have place in the Limca Book of Records | Sakshi
Sakshi News home page

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో దంపతులకు చోటు

Mar 29 2017 9:34 PM | Updated on Sep 5 2017 7:25 AM

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో దంపతులకు చోటు

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో దంపతులకు చోటు

కర్నూలు నగరానికి చెందిన దంపతులకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది.

–వేర్వేరు సంవత్సరాల్లో ఒకే సమయంలో పిల్లలకు జననం
కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగరానికి చెందిన దంపతులకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. స్థానిక నరసింహారెడ్డి నగర్‌లో నివసించే మహబూబ్‌నసీర్‌ మెడికల్‌ విభాగంలో పనిచేస్తారు. ఆయన భార్య రుబీనా సుల్తానా(34) 2015 ఏప్రిల్‌ 9వ తేదీన ఉదయం 6.45 నిమిషాలకు అమ్మాయి(ఆయేషా నౌసీన్‌)కు జన్మనిచ్చింది. రెండో కాన్పులోనూ ఆమె 2016 ఏప్రిల్‌ 9వ తేదీన ఉదయం 6.33 నిమిషాలకు మగబిడ్డ(మహబూబ్‌ సాబీద్‌)కు జన్మనిచ్చింది. వీరిద్దరూ స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని అశ్విని హాస్పిటల్‌లో జన్మించారు. వేర్వేరు సంవత్సరాల్లో సరిగ్గా ఏడాది సమయంలో ఒకే తేదీన, దాదాపుగా ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వడంతో రుబీనా సుల్తానా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కింది. ఈ మేరకు ఆ సంస్థ ఎడిటర్‌ విజయ ఘోష్‌ అవార్డు పత్రం పంపించారు. ఏప్రిల్‌ 9 వ తేదీన ఆ దంపతులకు పత్రం అందించి సన్మానం చేయనున్నారు. కాగా రుబీనాసుల్తానా.. తన తల్లి​దండ్రులు మోయినుద్దీన్‌, రపీయాబీ స్థాపించిన రుబీనా ఉమెన్‌ వెల్ఫెర్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement