స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు.. | The confrontation between young people | Sakshi
Sakshi News home page

స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..

Mar 14 2016 2:36 AM | Updated on Sep 3 2017 7:40 PM

స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..

స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..

స్నేహితుడి చెల్లెలిని కొందరు వేధిస్తుండడంతో.. ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు...

యువకుల మధ్య ఘర్షణ
     
స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..
కత్తెరతో పొడిచి చంపారు.. సూర్యాపేటలో ఘటన

 
సూర్యాపేట మున్సిపాలిటీ: స్నేహితుడి చెల్లెలిని కొందరు వేధిస్తుండడంతో..  ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గుర య్యాడు. స్నేహితుడికి సహాయం చేద్దామని వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం రాత్రి జరిగింది.  పట్టణంలోని గౌండ్ల బజార్‌కు చెం దిన మాందాస్ లక్ష్మి-సాయిలు  కుమారుడు ఉపేందర్(21)  కిరాణం దుకాణంలో గుమస్తా. ఆదివారం దుకాణానికి సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. కాగా, అదే వీధికి చెందిన తన స్నేహితుడు నాగరాజు చెల్లెల్ని పట్టణంలోని పీఎస్సార్ సెంటర్, రాజీవ్‌నగర్ (బర్లపెంట బజార్)కు చెందిన కొందరు యువకులు వేధిస్తున్నారు.

ఈ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న ఉపేందర్‌కు చెప్పి అతడితోపాటు మరో నలుగురు స్నేహితులను తీసుకొని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల శివాలయం వద్దకు చేరుకున్నా రు. అప్పటికే శివాలయం వద్ద ఉన్న వేధింపులకు పాల్పడిన యువకులు వెంటనే వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాల యువకుల మధ్య పెనుగులాట జరి గింది. దీని నుంచి తేరుకున్న నాగరాజు,  స్నేహితులు అక్కడి నుంచి పారిపోగా ఉపేందర్‌పై అప్పటికే పిడిగుద్దుల వర్షం కురిపించడంతో కింద పడిపోయాడు. ఇదే క్రమంలో వేధింపులకు పాల్పడుతున్న యువకుల్లో ఒకరు శివాలయానికి సమీపంలో గల బార్బర్ దుకాణంలోని కత్తెరను తెచ్చి, సొమ్మసిల్లి కిందపడిపోయిన ఉపేందర్ గుండెల్లోకి పొడిచాడు. దీంతో అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement