వ్యక్తి దారుణ హత్య.. కూతురిపై అనుమానం.. | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య.. కూతురిపై అనుమానం..

May 22 2016 4:11 PM | Updated on Sep 4 2017 12:41 AM

జిల్లాలోని వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

జిల్లాలోని వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన త్యాపాల నగేష్(40) శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

మృతదేహం మర్మాంగాలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మర్మాంగాల పై బలంగా కొట్టడంతోనే నగేష్ మృతిచెందాడని అనుమానిస్తున్న పోలీసులు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగేష్ పెద్ద కూతురు వివాహేతర సంబంధాలు నడుపుతున్న నేపథ్యంలో గతంలో తండ్రి ఆమెను మందలించాడు. అది మనసులో పెట్టుకున్న యువతి భర్తతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement