వికారాబాద్‌లో మేస్త్రీ దారుణ హత్య | the brutal murder in VIKARABAD | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో మేస్త్రీ దారుణ హత్య

Sep 19 2016 12:05 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో యాదయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అత్వేల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ యాదయ్య(35)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న అనంతరామ్ బ్రాందీ షాపులో ఆదివారం రాత్రి మద్యం సేవించినపుడు గొడవ జరిగి దుండగులు రాళ్లతో కొట్టి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement