గొంతులో రొట్టె ఇరుక్కుని బాలుడి మృతి | The bread stuck in the throat, killing a boy | Sakshi
Sakshi News home page

గొంతులో రొట్టె ఇరుక్కుని బాలుడి మృతి

Sep 28 2016 9:41 PM | Updated on Sep 28 2018 3:41 PM

రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

జీడిమెట్ల: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సుమన్ కథనం ప్రకారం... కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఆటో డ్రైవర్‌.  ఇతనికి సంజయ్‌ (3) ఏకైక కుమారుడు.  మంగళవారం రాత్రి 8  గంటలకు సంజయ్‌కు రొట్టె తినిపిస్తుండగా  గొంతులో ఇరుక్కుపోయింది.

ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తమ గారాలపట్టి తమ కళ్లెదుటే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి సంజయ్‌ మృతి కుత్బుల్లాపూర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement