ఈతకు వెళ్లి బాలుడు మృత్యువాత | The boy killed after submerged in water | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి బాలుడు మృత్యువాత

May 24 2016 11:28 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు చనిపోయాడు.

నల్లగొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు చనిపోయాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన కొందరు బాలురు మంగళవారం ఉదయం చివ్వెంల సమీపంలోని క్వారీల వద్దకు వచ్చారు. ఇటీవలి వర్షానికి క్వారీ గుంతలో నిలిచిన నీటిలో ఈత కొట్టేందుకు దిగారు. కటికం బన్ను(12) మాత్రం ఈత సరిగా రాక నీటిలో మునిగి చనిపోయాడు. తోటి వారు విషయం గమనించి స్థానికులకు తెలపటంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement