చైల్డ్‌హోంలో విదేశీయుల సందడి | The Belgians who took up the service programs | Sakshi
Sakshi News home page

చైల్డ్‌హోంలో విదేశీయుల సందడి

Jul 18 2017 5:54 AM | Updated on Apr 4 2019 5:24 PM

చైల్డ్‌హోంలో విదేశీయుల సందడి - Sakshi

చైల్డ్‌హోంలో విదేశీయుల సందడి

మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో గల వెబర్‌ చైల్డ్‌ హోమ్‌లో సోమవారం బెల్జియం దేశానికి చెందిన 12 మంది ప్రొఫెసర్లు, టీచర్లు సందడి చేశారు.

సేవా కార్యక్రమాలు చేపట్టిన బెల్జియం దేశస్తులు
చౌటుప్పల్‌ (మునుగోడు) : మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో గల వెబర్‌ చైల్డ్‌ హోమ్‌లో సోమవారం బెల్జియం దేశానికి చెందిన 12 మంది ప్రొఫెసర్లు, టీచర్లు సందడి చేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన సభ్యులు సోమవారం చైల్డ్‌ హోం సందర్శించారు. బెల్జియం దేశంలోని ఫార్‌ మిస్‌ టెర్రీ (భూమి మీది చీమలు) అనే స్వచ్ఛం ధ సంస్థకు చెందిన సభ్యులు ఆ దేశంలోని ఇన్‌ఫాంట్‌ డీలాఫాక్స్‌ సంస్థ తరఫున ఇక్కడికి వచ్చారు. పర్యటనలో భాగంగా హోం ఆవరణలో మొక్కలు నాటారు. 1992లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రతి రెండేళ్లకోసారి వివిధ దేశాల్లో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అనంతరం చైల్డ్‌ హోం లోని తరగతి, హాస్టల్‌ గదులకు రూ. ఐదు లక్షలు వెచ్చించి రంగులు వేశారు.

అనాథ విద్యార్థులతో ఆప్యాయంగా..
బెల్జియం దేశం నుంచి వచ్చిన సభ్యులు చైల్డ్‌ హోంలోని అనాథ విద్యార్థులతో ఆప్యాయతను పంచుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. చైల్డ్‌హోంకు వచ్చిన వారిలో జెరాల్డ్, రోజ్, లూసీ, ఫాబ్రసీ, ఎలోడి, మేరి, కేథరిన్, అన్, బ్రిజిత్, అర్నాండ్, వేటేజర్, బావేతో పాటు చిన్నారులు జేన్, లూయిస్‌లు  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement