ఆ బిల్లుతో విద్యుత్‌ రంగం వినాశనం | That Amendment bill collapses Electricity wing | Sakshi
Sakshi News home page

ఆ బిల్లుతో విద్యుత్‌ రంగం వినాశనం

Oct 16 2016 5:31 PM | Updated on Sep 5 2018 1:46 PM

ఆ బిల్లుతో విద్యుత్‌ రంగం వినాశనం - Sakshi

ఆ బిల్లుతో విద్యుత్‌ రంగం వినాశనం

విద్యుత్‌రంగాన్ని నాశనం చేసే విద్యుత్‌ సవరణ బిల్లు –2015ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి 
కాకుమాను నాగేశ్వరరావు
 
గుంటూరు వెస్ట్‌: విద్యుత్‌రంగాన్ని నాశనం చేసే విద్యుత్‌ సవరణ బిల్లు –2015ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో విద్యుత్‌ ఉద్యోగ, కార్మికుల రాష్ట్రస్థాయి శిక్షణ  తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్‌ సవరణల వల్ల రూ.3 లక్షల కోట్లు విలువైన ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు ఉపయోగించుకుని ప్రైవేటు వ్యక్తులు లాభాలు గడించడానికి ఉపయోగపడనున్నాయని చెప్పారు. దీనివల్ల పంపిణీ సంస్థలు దివాలా తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఏ విధమైన సౌకర్యాలు లేవని, జీతభత్యాలు కూడా ఇతర విభాగాలలోని కాంట్రాక్టు కార్మికుల కన్నా తక్కువగా ఇస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement