ఎమ్మెల్యే శంకరన్నకు కోపమొచ్చింది | Thamballapalle mla shankar takes on govt high school principal | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే శంకరన్నకు కోపమొచ్చింది

Jan 27 2016 9:24 AM | Updated on Sep 3 2017 4:25 PM

ఎమ్మెల్యే శంకరన్నకు కోపమొచ్చింది

ఎమ్మెల్యే శంకరన్నకు కోపమొచ్చింది

తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్‌కు కోపమొచ్చింది. మంగళవారం బి.కొత్తకోట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో జనం లేరని అసహనం వ్యక్తంచేశారు.

సభలో జనం లేరని అసహనం
హెచ్‌ఎం, ఐకేపీ ఏపీఎంపై ఆగ్రహం
మహిళా టీచర్ ఫిర్యాదుతో మారిన సీన్
హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని డీఈవోకు వినతి
నేటి నుంచి సెలవులో వెళతానన్న హెచ్‌ఎం

 
 
బి.కొత్తకోట : తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్‌కు కోపమొచ్చింది. మంగళవారం బి.కొత్తకోట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో జనం లేరని అసహనం వ్యక్తంచేశారు. హెచ్‌ఎం, ఐకేపీ ఏపీఎంపై చిర్రుబుర్రులాడారు. అంతేగాక ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని డీఈవోను కోరారు.
 
ఈ పరిణామాల అనంతరం మనస్తాపానికి గురైన హెచ్‌ఎం మోహన్‌వేలన్ తాను బుధవారం నుంచి సెలవులో వెళుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇక్కడ విధుల్లో కొనసాగరాదని నిర్ణయించుకున్న ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. బుధవారం మదనపల్లె డీవైఈవోకు లీవ్‌లెటర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  
 
తర్వాత ఐకేపీ ఏపీఎం సుబ్రమణ్యంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఉపకారవేతనాలు ఇవ్వాలంటే లబ్ధిదారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సభానంతరం ఎమ్మెల్యేకు అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు హెచ్‌ఎం మోహన్‌వేలన్‌పై ఫిర్యాదు చేశారు. డీఈవోకు ఫిర్యాదు పంపినట్టు చెప్పడంతో ఆ కాపీ ఇవ్వాలని ఎమ్మెల్యే అడిగి తీసుకున్నారు. వెంటనే చిత్తూరు డీఈవోకు ఫోన్‌చేసి మాట్లాడారు.
 
ఎమ్మెల్యే హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పాఠశాలకు ఎవరు ఇన్‌చార్జ్ హెచ్‌ఎంగా ఉంటారని ఆరా తీశారు. సీనియారిటీ ప్రకారం ఓ టీచర్‌తో పాఠశాలను చక్కదిద్దాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement