జిల్లాలో టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే గ డువు ఈనెల 13వ తేదీ వరకు ఉందని డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం.శంకర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు.
టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు గడువు 13వ తేదీ
Aug 3 2016 12:12 AM | Updated on Sep 26 2018 3:25 PM
విద్యారణ్యపురి : జిల్లాలో టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే గ డువు ఈనెల 13వ తేదీ వరకు ఉందని డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం.శంకర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఒక్క పేపర్‌కు రూ. 25 అపరాధ రుసుముతో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు , ఒక్క పేపర్‌కు రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు లు చెల్లించవచ్చన్నారు. ఇంటర్ విద్యార్థులు థియరీ సబ్జెక్టుకు రూ.150 చొప్పున, ప్రాక్టికల్స్‌కు పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. టెన్త్ విద్యార్థులు ఒక్క థియరీ సబ్జెక్టుకు రూ.100 చొప్పున, ప్రాక్టికల్స్ పేపర్‌కు ఒక్క దానికి రూ.50 చొప్పున మీసేవా, ఏపీ ఆ న్‌లైన్‌లో ఫీజు చెల్లించాలన్నారు. కాగా, ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు ఈఏడాది అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
Advertisement


