విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పాతపాడేరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖపట్టణం: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పాతపాడేరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు మండలం లోతలిపుట్టు గ్రామానికి చెందిన వెంకటరాజు(15) జీకేవీధి మండలం ఆర్‌వీనగర్‌లోని శాంతిసదన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి అతడు పాతపాడేరులో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్సై సూర్యప్రకాశ్‌రావు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పక్కన పుస్తకాలు, దుస్తులు, బ్యాగు ఉన్నాయి.. అయితే అతడి దుస్తుల్లో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.