తనకల్లులో 10.9 డిగ్రీలు కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

తనకల్లులో 10.9 డిగ్రీలు కనిష్టం

Feb 7 2017 11:32 PM | Updated on Sep 5 2017 3:09 AM

కొన్ని మండలాల్లో రాత్రిళ్లు చలి వాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండతీవ్రత పెరుగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : కొన్ని మండలాల్లో రాత్రిళ్లు చలి వాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండతీవ్రత పెరుగుతోంది. మంగళవారం తనకల్లులో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా అగళి 11.3 డిగ్రీలు, మడకశిర 11.5 డిగ్రీలు, రొద్దం 12.4 డిగ్రీలు, నల్లమాడ 12.5 డిగ్రీలు, సోమందేపల్లి 12.6 డిగ్రీలు, లేపాక్షి 12.8 డిగ్రీలు, కొత్తచెరువు, ఎన్‌పీకుంట 13.8 డిగ్రీలు కొనసాగగా మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 32 నుంచి 35 డిగ్రీలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement