రాత్రికి గజగజ.. | temperature details | Sakshi
Sakshi News home page

రాత్రికి గజగజ..

Jan 20 2017 11:23 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతుండగా గాలి వేగం కూడా పెరగడంతో రాత్రి వేళల్లో శీతల వాతావరణం నెలకొంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతుండగా గాలి వేగం కూడా పెరగడంతో రాత్రి వేళల్లో శీతల వాతావరణం నెలకొంది. శుక్రవారం మడకశిరలో 11 డిగ్రీలు, అగళి 11.2 డిగ్రీలు, రొద్దం 12.2 డిగ్రీలు, సోమందేపల్లి 12.5 డిగ్రీలు, గుత్తి 12.6 డిగ్రీలు, తనకల్లు 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గాయి. జిల్లా అంతటా 28 నుంచి 31 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement