కొనసాగుతున్న చలి తీవ్రత | temperature details | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న చలి తీవ్రత

Jan 19 2017 11:56 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితీవ్రత కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితీవ్రత కొనసాగుతోంది. గురువారం మడకశిరలో 9.7 డిగ్రీలు, అగళి 9.8  , రొద్దం 10.1  , అమరాపురం 10.3  , సోమందేపల్లి 11.1  , లేపాక్షి 11.5  , గుడిబండ 11.6  , బెళుగుప్ప 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  మిగతా మండలాల్లో 12 నుంచి 17 డిగ్రీలు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 35 శాతం మధ్య నమోదయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement