తెలుగు మందులు | telugu language on english medicines | Sakshi
Sakshi News home page

తెలుగు మందులు

Sep 11 2017 11:37 AM | Updated on Oct 16 2018 3:26 PM

టానిక్‌ సీసాలు, టాబ్లెట్‌ షీట్లపై తెలుగులో ఉన్న పేర్లు - Sakshi

టానిక్‌ సీసాలు, టాబ్లెట్‌ షీట్లపై తెలుగులో ఉన్న పేర్లు

తెలుగు మందులు.. అన గానే ఇవేవో తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే మందులు కావు!

టానిక్‌లు, మందు గోళీలపై ‘మన భాష’లో పేర్లు
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, నిరక్షరాస్యులకు తప్పనున్న తిప్పలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు


రోగులకు సమస్య ఉండదు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్యశాఖలో పలు రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందులపై తెలుగులో పేర్లు ముద్రిస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, కనీస అక్షర జ్ఞానం ఉన్న వారికి సులువుగా మందుల పేర్లు అర్థమై ఎలా వాడాలో తెలిసిపోతుంది. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అయ్యే డ్రగ్స్‌ పక్కదారి పట్టే అవకాశం ఏమాత్రం ఉండదు. వీటిని ఎవరైనా బయటి మెడికల్‌ దుకాణాలకు విక్రయించినా సులువుగా గుర్తించొచ్చు.
– డాక్టర్‌ రాంకిషన్, జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

పాలమూరు : తెలుగు మందులు.. అన గానే ఇవేవో తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే మందులు కావు! ఇందులో కొన్ని ఇక్కడ తయారవుతాయి కావొచ్చు కానీ భాషతో ఈ మందులకేం సంబంధం లేదు!! గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యుల ఇబ్బందులను తీర్చడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు సరఫరా అయ్యే మందులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే ప్రతీ టానిక్‌ సీసా, టాబ్లెట్‌ సాషెట్‌పై ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేర్లు ముద్రిస్తున్నారు.

ఇకపై పక్కాగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను కొందరు ప్రైవేట్‌ మందుల దుకాణాలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై ‘గవర్నమెంట్‌ సప్లై.. నాట్‌ ఫర్‌ సేల్‌’ అన్ని చిన్న అక్షరాలతో ఉన్నా ఇంగ్లిష్‌ టానిక్‌ సీసాలు, టాబ్లెట్‌ షీట్లపై తెలుగులో ఉన్న పేర్లు  తెలుగు మందులు దరికీ అర్థం కాదు కాబట్టి ప్రైవేట్‌ షాపుల్లో అమ్మకాలు యథేచ్చగా సాగేవి. ప్రస్తుతం మందుల పేర్లే కాకుండా హెచ్చరికను సైతం పెద్ద అ క్షరాలతో ‘తెలంగాణ ప్రభుత్వం ఉచిత సరఫరా.. అమ్మడానికి కాదు’ అని తెలుగులో ముద్రించారు. దీంతో సామాన్యులు సైతం ఇవి ఉచితంగా సరఫరా చేసే మందులు అన్ని గుర్తించడం సులువవుతోంది.

ఆంగ్లం.. తెలుగు
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల పేర్ల ముద్రణలో మార్పులు చేసింది. గతంలో ఆంగ్లంలోనే పేర్లు ఉండడంతో పెద్దగా చదువుకోలేని పల్లె వాసులకు పూర్తిగా అవగాహన ఉండేది కాదు. ఫార్మసిస్టులు చెప్పినా ఇంటికి వెళ్లాక వాడడంతో అయోమయంలో నెలకొనేది. ఆకుపచ్చ రంగు మాత్రలు ఉదయం.. తెలుపు రంగు మాత్రలు ఉదయం, రాత్రి వేసుకోవాలని నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా సిబ్బంది చెప్పేవారు. ప్రస్తుతం ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేర్లు ముద్రిస్తుండడంతో కనీస అక్షర జ్ఞానం ఉన్న వారు సైతం సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉంది. ఇదివరకు మాదిరిగా మాత్రలు మందులపై పేర్లు చదవడానికి రాక ఒకదానికి బదులుగా మరొకటి వేసుకునేపరిస్థితి ఇక ఉండబోదని ఫార్మసిస్టులు, వైద్యులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement