తప్పతాగి పాఠశాలలో పోకిరీవేషాలు | teachers suspended | Sakshi
Sakshi News home page

తప్పతాగి పాఠశాలలో పోకిరీవేషాలు

Sep 24 2016 9:59 AM | Updated on Aug 17 2018 7:40 PM

తప్పతాగి పాఠశాలలో పోకిరీవేషాలు - Sakshi

తప్పతాగి పాఠశాలలో పోకిరీవేషాలు

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే నడవడిక తప్పాడు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి తప్పతాగి ఆలయం వంటి పాఠశాలలోనే పోకిరీవేషాలు వేశాడు.

మైలవరం: 
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే నడవడిక తప్పాడు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి తప్పతాగి ఆలయం వంటి పాఠశాలలోనే పోకిరీవేషాలు వేశాడు. వివరాల్లోకి వెళ్తే... విధి నిర్వహణలో మద్యం తాగి సహచర ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఉపాధ్యాయుడు పి. రామును సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మైలవరం మండల విద్యాశాఖాధికారి ఎల్‌. బాలు తెలిపారు.

మైలవరం మండలం సీతారామపురం తండా ఎంపియూపి స్కూల్లో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి. రామును బాడవ ఎంపిపి పాఠశాలకు ఇటీవల డిప్యూటేషన్‌పై పంపారు. అయితే రాము మద్యం సేవించి రావడమే గాక తోటి సహచర ఉపాధ్యాయిని, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఆ పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపి రాము పోకిరీవేషాలు వాస్తవమేనని డీఈవోకు నివేదిక పంపారు. దాని ఆధారంగా ఉపాధ్యాయుని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement